మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం మండలానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు పిట్లం టౌన్ ప్రెసిడెంట్ బుగుడల నవీన్ ముదిరాజ్ జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఈ చేరికతో పిట్లం మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం మరింతగా పెరిగి,పార్టీకి మేలు జరుగుతుందని,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు.ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే వారికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు.నవీన్ చేరికతో మండల రాజకీయాల్లో కాంగ్రెస్ శక్తి మరింతగా విస్తరిస్తుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి,పీఏసీఎస్ చైర్మన్ శపథమ్ రెడ్డి,వైస్ చైర్మన్ వెంకటరెడ్డి,స్థానిక సర్పంచ్ అభ్యర్థి కుమ్మరి శేఖర్,తదితరులు ఉన్నారు.








