మన ధ్యాస ,తోటపల్లి గూడూరు , డిసెంబర్ 7:నెల్లూరు జిల్లా ,తోటపల్లి గూడూరు మండలం, కోడూరు బీచ్ దగ్గర లోని ముత్యాలతోపు గ్రామంలోని యేసు ప్రార్థన మందిరం నందు ఆదివారం జరిగిన ఆరాధన కూడిక లో ముఖ్య ప్రసంగీకులుగా పాస్టర్స్ పవర్ జాతీయ అధ్యక్షులు,లార్డ్ జీసస్ ప్రేయర్ మినిస్ట్రీ డైరెక్టర్ పులగర శోభనబాబు పాల్గొని “పండుగలు” అను అంశంపై ప్రసంగించారు.పరిశుద్ద గ్రంధం లోని పాత నిబంధన, క్రొత్త నిబంధనలో పండుగల ప్రాముఖ్యతను వివరించారు. పండుగల వలన మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశమియ్యకుడి అని అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి హెచ్చరించినట్లు గుర్తు చేశారు.పండుగలు ఆచారాలు, ఆడంబరాలు,ఆర్భాటాలు లేకుండా మనుష్యుల మెప్పు కొరకు కాకుండా వాక్యాను సారంగా ఆరాధన, ప్రార్థన,వినయ,విధేయతలతో, దేవునికి మహిమ,ఘనత, ప్రభావాలు కలుగునట్లు పండుగ ఆరాధనలు జరుపుకోవాలని పులగర సూచించారు.







