నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన ధ్యాస,నెల్లూరు రూరల్ ,డిసెంబర్ 7: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఆదివారం 27వ డివిజన్, రిత్విక్ ఎనక్లేవ్ పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులను పర్యవేక్షించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పి4 కార్యక్రమంలో భాగంగా ఎస్.ఇ.ఐ.ఎల్. కంపెనీ సీ.ఎస్.ఆర్. ఫండ్స్ ద్వారా దాదాపు కోటి 80 లక్షల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 22 పార్కుల్లో సోలార్ లైట్స్ ఏర్పాటు చేసేందుకు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు తీసుకురావడం సంతోషకరం అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చొరవతో చంద్రన్న పార్కుల బాట కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26 డివిజన్ లలో 18 ఎకరాల విస్తీర్ణం కలిగి, 400 కోట్ల రూపాయల విలువ కలిగిన పార్కుల ప్రభుత్వ భూమిని, 7కోట్ల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడలు నిర్మించి, కబ్జా దారుల నుండి కాపాడాం అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26 డివిజన్ లలో పార్కులలో 35 లక్షల రూపాయలతో 2370 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే మొక్కలు నాటటం జరిగింది, స్థానిక ప్రజల అందరూ నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలి. పార్కుల అభివృద్ధిలో కూడా స్థానిక ప్రజలు, వాకర్స్ అసోసియేషన్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ప్రజా సంఘాలు పాలుపంచుకోవాలి అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. ఇంత మంచి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి, నిరంతరం ప్రజల్లో ఉండే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలి అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ , యువనేత, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ నెల్లూరు రూరల్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తునందుకు నెల్లూరు రూరల్ ప్రజల పక్షాన నా ప్రత్యేక ధన్యవాదాలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు.పై కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ భీమినేని మురహరి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, టిడిపి నాయకులు ఆదినారాయణ, మోహన్, కుమార్, సుబ్బరాజు, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    మన ధ్యాస , నెల్లూరు ,డిసెంబర్ 7: నెల్లూరు నగరం ,48వ డివిజన్ ప్రజల చిరకాల కోరికను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెరవేర్చారు.డివిజన్లో పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు 40 ఏళ్లుగా ప్రహరీ గోడ ,…

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    మన ధ్యాస ,తోటపల్లి గూడూరు , డిసెంబర్ 7:నెల్లూరు జిల్లా ,తోటపల్లి గూడూరు మండలం, కోడూరు బీచ్ దగ్గర లోని ముత్యాలతోపు గ్రామంలోని యేసు ప్రార్థన మందిరం నందు ఆదివారం జరిగిన ఆరాధన కూడిక లో ముఖ్య ప్రసంగీకులుగా పాస్టర్స్ పవర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    ప్రజాసేవలో ఇద్దరూ….ఇద్దరే , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…. పొంగూరు నారాయణ

    ప్రజాసేవలో ఇద్దరూ….ఇద్దరే , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…. పొంగూరు నారాయణ

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు