అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన ధ్యాస ,నెల్లూరు , డిసెంబర్ 7:అప్పన్న అనే వ్యక్తి కుటుంబానికి జరుగుబాటు లేకపోవడంతోనే తాను సేవా భావంతో రూ.50 వేలు చెక్కు ఇచ్చానని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పై చేసిన అనవసర ఆరోపణలకు ఎంపీ వేమిరెడ్డి స్పష్టత ఇచ్చారు. కనుపర్తిపాడులోని విపిఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్‌ జగన్‌ తనపై అనవసరంగా కామెంట్స్ చేశారని, తాను ఏంటో ఆయన ఆత్మకే వదిలేస్తున్నానన్నారు. ఎవరు చెబితే తాను ఇచ్చానో తెలియదా అని ప్రశ్నించారు. శ్రీ కాకుళంకు చెందిన అప్పన్న అనే వ్యక్తి పేదవాడు, జరుగుబాటు లేదు అని నాడు వైవీ సుబ్బారెడ్డి దగ్గర చేరితే, సుబ్బారెడ్డి తాను సహాయం చేయలేను అని నన్ను అడిగితే… ఈ రోజు ఏ విధంగా అయితే సహాయం చేశానో.. ఆ రోజు కూడా అలాగే చేశానని కుండబద్దలు కొట్టారు. తాను మాట్లాడే విషయాలు సత్యమా, కాదా అనేది దేవుడి ముందుకు వచ్చి ప్రమాణం చేయాలన్నారు. ఎవరైనా నా దగ్గరికి వచ్చి జరుగుబాటు లేదని అంటే.. ఇప్పటికీ కూడా చాలామందికి సహాయం చేస్తున్నానని, తాను నెలలో సహాయం చేసేవాళ్ల లిస్ట్‌ తీస్తే చాలామంది ఉంటారన్నారు. ఈ విషయాలు వారికి కూడా తెలుసని, ఎవరు చెబితే ఇచ్చానో వారి దృష్టిలో ఉందన్నారు. అసలు తనపై అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరమే లేదని ఖండించారు. సేవాభావంతోనే తాను సహాయం చేస్తుంటానని, సేవ చేయడం కూడా తప్పవుతోందని అన్నారు. బండలు మోయాల్సి వస్తోందని ఆవేదన చెందారు. ఎంత చేశామో, ఎవరికి చేశామో, మనం చేసే మంచేంటో దేవుడికే తెలుసని, జగన్‌ మోహన్‌రెడ్డి మాటలు బాధేశాయి కాబట్టే ఇప్పుడు చెబుతున్నానన్నారు.

  • Related Posts

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    మన ధ్యాస , నెల్లూరు ,డిసెంబర్ 7: నెల్లూరు నగరం ,48వ డివిజన్ ప్రజల చిరకాల కోరికను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెరవేర్చారు.డివిజన్లో పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు 40 ఏళ్లుగా ప్రహరీ గోడ ,…

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    మన ధ్యాస ,తోటపల్లి గూడూరు , డిసెంబర్ 7:నెల్లూరు జిల్లా ,తోటపల్లి గూడూరు మండలం, కోడూరు బీచ్ దగ్గర లోని ముత్యాలతోపు గ్రామంలోని యేసు ప్రార్థన మందిరం నందు ఆదివారం జరిగిన ఆరాధన కూడిక లో ముఖ్య ప్రసంగీకులుగా పాస్టర్స్ పవర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    ప్రజాసేవలో ఇద్దరూ….ఇద్దరే , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…. పొంగూరు నారాయణ

    ప్రజాసేవలో ఇద్దరూ….ఇద్దరే , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…. పొంగూరు నారాయణ

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు