హిందీకి వ్యతిరేకంగా పోరాడండి.. తమిళ భాషను కాపాడుకోవాలి – డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్

Mana News :- కేంద్ర ప్రభుత్వం- తమిళనాడు సర్కార్ మధ్య వివాదం కొనసాగుతుంది. తాజాగా, ఈ వివాదంపై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పందించారు. చెన్నైలోని నందనం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో తమిళనాడు మాజీ సీఎం ఎం. కరుణానిధి పేరుతో 4.80 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన ఆడిటోరియం ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘పెరియార్‌, గ్రాండ్‌మాస్టర్‌ అన్నా, ముత్తమిళర్ కళైంజర్ తో పాటు మన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో సహా పలువురు హిందీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారని పేర్కొన్నారు. 1986లో హిందీకి వ్యతిరేకంగా కరుణానిధి చేసిన ప్రసంగం ఇప్పటికీ ప్రతి ఒక్కరికీ గుర్తిండి పోయిందని చెప్పుకొచ్చారు. అయితే, 1956లో హిందీకి వ్యతిరేకంగా విద్యార్థుల చేసిన నిరసనలే తమిళ సంస్కృతిని కాపాడాయని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. కాగా, NEET, NEPలతో తమిళ విద్య వ్యవస్థను దెబ్బ తీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. వీటి ద్వారా తమిళనాడుపై బలవంతంగా హిందీని రుద్దుతోంది.. ఇది హిందీకి వ్యతిరేకంగా పోరాటం కేవలం భాషపై పోరాటం మాత్రమే కాదు.. తమిళ సంస్కృతిని రక్షించడానికి ఒక జాతి పోరాటం.. ఈ పోరాటం కొనసాగుతుందని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు.

Related Posts

ప్రైవేట్ స్కూళ్ల అడ్మిషన్లపై విద్యాశాఖ కొరడా

mana News :- ప్రతి ఏడాది కొత్త కొత్త స్కూల్స్ పుట్టుకొస్తున్నాయి. దింతో పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలు ఎక్కడ అడ్మిషన్ చేయాలో కూడా అర్ధంకానీ పరిస్థితి. మరోవైపు స్కూల్ అడ్మిషన్ల పేరుతో విద్య సంస్థలు ఇష్టానుసారంగా సామాన్యుల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి.…

లోక్‌సభ ముందుకు ‘వక్ఫ్‌ బిల్లు’.. ఏ కూటమి బలమెంత..?

Mana News :-దిల్లీ: వివాదాస్పద వక్ఫ్‌ (సవరణ) బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా విపక్షాలన్నీ మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నాయి. తొలుత దీని (Waqf Bill)పై సభలో చర్చ నిర్వహించి, అనంతరం ఓటింగ్‌ జరపనున్నారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఉగ్ర దాడిని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన.

ఉగ్ర దాడిని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన.

పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

  • By APUROOP
  • April 24, 2025
  • 3 views
పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

  • By APUROOP
  • April 24, 2025
  • 4 views
కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

  • By APUROOP
  • April 24, 2025
  • 4 views
పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

ఉగ్రవాద దాడులను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

  • By APUROOP
  • April 24, 2025
  • 3 views
ఉగ్రవాద దాడులను నిరసిస్తూ  కొవ్వొత్తుల ర్యాలీ

శంఖవరం మోడల్ స్కూల్ ప్రతిభ. విద్యార్థుల అద్వితీయ విజయం..

  • By APUROOP
  • April 24, 2025
  • 3 views
శంఖవరం మోడల్ స్కూల్ ప్రతిభ. విద్యార్థుల అద్వితీయ విజయం..