ప్రైవేట్ స్కూళ్ల అడ్మిషన్లపై విద్యాశాఖ కొరడా

mana News :- ప్రతి ఏడాది కొత్త కొత్త స్కూల్స్ పుట్టుకొస్తున్నాయి. దింతో పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలు ఎక్కడ అడ్మిషన్ చేయాలో కూడా అర్ధంకానీ పరిస్థితి. మరోవైపు స్కూల్ అడ్మిషన్ల పేరుతో విద్య సంస్థలు ఇష్టానుసారంగా సామాన్యుల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. అయితే విద్య అనేది వ్యాపారంల మారకూడదు అనే ఉదేశ్యంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ తరుణంలో కర్ణాటకలోని ప్రైవేట్, నాన్ ఎయిడెడ్ స్కూల్స్ 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియలో విద్యాశాఖ కీలకమైన మార్పులు చేసింది. దింతో స్కూల్స్ ఏ సిలబస్ అనుసరించినా ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన స్కూళ్ల పై కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. తప్పనిసరిగా ఉండాల్సిన వివరాలు
ఇకపై స్కూల్స్ అడ్మిషన్ల షెడ్యూల్, ఒక్కో క్లాసులో ఉన్న సీట్ల సంఖ్య, టీచింగ్ విధానం ఇంకా ఫీజుల వివరాలను తప్పనిసరిగా స్కూల్ నోటీసు బోర్డుపై ప్రదర్శించాలి. అంతేకాకుండా ఈ సమాచారం స్కూల్ వెబ్‌సైట్, SATS పోర్టల్ అండ్ ప్రాస్పెక్టస్‌లో కూడా తప్పసరిగా ఉంచాలి. బాలికలకు ప్రత్యేక రిజర్వేషన్లు: కో-ఎడ్యుకేషన్ స్కూళ్లలో బాలికలకు 50% సీట్లు రిజర్వ్ చేసింది. ఒకవేళ తక్కువ మంది బాలికలు అడ్మిషన్ కోసం అప్లయ్ చేసుకుంటే మిగిలిన ఆ సీట్లను బాలురకు కేటాయించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు కూడా రిజర్వేషన్లు ఉంటాయి. ఫీజుల విషయంలో స్పష్టత
స్కూల్ విద్యా సంవత్సరానికి సంబంధించిన పూర్తి ఫీజుల వివరాలను ముందుగానే ప్రకటించాలి. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కాకుండా ఇతర అదనపు ఛార్జీలు లేదా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఇంటర్వ్యూలకు స్వస్తి: అడ్మిషన్ల సమయంలో విద్యార్థులకి లేదా వారి తల్లిదండ్రులకి ఇంటర్వ్యూ చేయడం ఇకపై నిషేధం. ఈ నిబంధనను ఉల్లంఘించిన స్కూళ్ల పై కూడా చర్యలు తప్పవు.

Related Posts

సర్పంచుల్లో ఉత్తముడు. వ్యాసాపురం సీతారాముడు.

ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని వ్యాసాపురం సర్పంచ్ సీతారాములు ఉత్తమ సర్పంచుగా ఎంపికైన సంగతి విధితమే. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి షాలు ఒక అప్పి పూలమాలలు వేసి మెమొంటోను బహుకరించారు. సర్పంచు…

దగ్గుబాటిని, చిరంజీవి ఆదర్శంగా తీసుకోవాలి.-చిరంజీవికి రెండేసి పెన్షన్లు అవసరమా!

కూటమి మాజీ ప్రభుత్వ నేతలకు ఒక్కొక్కరికి రెండేసి పెన్షన్లు.ఉరవకొండ మన న్యూస్: మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పొందుతున్న రెండేసి పెన్షన్లను స్వచ్ఛందంగా వదులుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారుకాగా చిరంజీవి ఆదర్శంగా నిలిచి రెండేసి పెన్షన్లను తక్షణమే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 10, 2025
  • 5 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..