సీఎం రేవంత్ రెడ్డితో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భేటీ – అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం పట్ల హర్షం

పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- మణుగూరు : ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తెలంగాణలో విద్యా వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి తీర్చిదిద్దుతున్నారని, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వెల్లడించారు. శనివారం ఆయన మీడియాకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. మారుమూల గిరిజన నియోజకవర్గమైన పినపాక నియోజకవర్గం కు నిరుపేద విద్యార్థుల ఉన్నత భవిష్యత్తును, దృష్టిలో పెట్టుకొని
విద్యార్థులకోసం తాను చేసిన విజ్ఞప్తిని గుర్తించి, నియోజకవర్గానికి యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేస్తూ, 200 కోట్ల నిధులను ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారని ఆయన పేర్కొన్నారు. అందుకు కృతజ్ఞతా భావంగా శనివారం సీఎం రేవంత్ రెడ్డితో తాను ప్రత్యేకంగా భేటీ అయి, నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపి, సీఎం రేవంత్ రెడ్డికి భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో నియోజక వర్గానికి మంజూరైన రెసిడెన్షియల్ స్కూల్ లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్య, సౌకర్యాలు కల్పిస్తామని సీఎం తెలిపారని చెప్పారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రజా ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రకాల రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తున్నట్లు, వీటిని ఇకపై ‘యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియ
ల్‌ స్కూళ్లు’గా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంప్‌సలు ఏర్పాటు చేస్తారని, ఇందుకోసం రూ.5000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. అలాగే మన నియోజకవర్గంలో ఏర్పాటు కానున్న స్కూలుకు 200 కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయని త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.తెలంగాణ లోని పాఠశాలల స్థితిగతులు మార్చేందుకు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణం చేపడుతుంద న్నారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేసేందుకు శక్తివంచ లేకుండా తాను కృషి చేస్తానని తెలిపారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు