కావలి, ఫిబ్రవరి 12,ఎల్లో సింగం ప్రతినిధి

77వ ఘనతంత్ర దినోత్సవము సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఉత్తమ సేవా పురస్కారం అవార్డులు పొందిన బలిజ ఉద్యోగులకు “బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి(బీస్) కావలి” వారిచే ఘనంగా సన్మానం చేసి వారి అమూల్యమైన సేవలను కొనియాడడమైనదిఈ కార్యక్రమంలో ఉత్తమసేవా అవార్డు గ్రహీతలు చల్లపల్లి వెంకటసుబ్బయ్యగారు ఎంఈఓ-2 కావలి, మరియు పేరిశెట్టి మాధవరావుప్రధానోపాధ్యాయులు, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల కావలి మరియు పర్వతరెడ్డి శ్రీహరి (ఇరిగేషన్ డిపార్ట్మెంట్), మరియు పసుపులేటి బాబురావు (రిటైర్డ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్- ఆర్పిఎఫ్ మరియు శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవస్థానం, కొండ బిట్రగుంట పాలక మండలి సభ్యులును బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి(బీస్) కావలి వారు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో బలిజ ఉద్యోగులు అందరూ పాల్గొని వారికి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి బీస్ కావలి ప్రెసిడెంట్ నాగిశెట్టి శ్రీనివాసరావు మరియు సెక్రటరీ బండి కోటి చలపతిరావు మరియు బీస్ సలహాదారులు మరియు మేధా జూనియర్ కాలేజ్ కరస్పాండెంట్ పాపిశెట్టి జానకిరామ్ గార్లు మాట్లాడుతూ బలిజ ఉద్యోగులలో ఎవరైనా ఇలాంటి అవార్డు గ్రహీతలును బీస్ ఎప్పుడు పిలిచి సత్కరించి గౌరవిస్తుందని తద్వారా వారు సమాజానికి ఇంకా మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని వాళ్లని సత్కరించి ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి కావలి కార్యవర్గ సభ్యులు నాగిశెట్టి వెంకట సతీష్, గాదిరెడ్డి మురళీకృష్ణ, గుణకల శివయ్య, పర్వతరెడ్డి సుధాకర్, పాశం శ్రీనివాసులు తదితర సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *