


మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, గ్రామాలలో పాఠశాలల అభివృద్ధిలో గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శనివారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యాబోధన సెంటర్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ..ప్రభుత్వం వివిధ విద్యా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నప్పటికీ, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల భాషా సామర్థ్యాలను, గణిత నైపుణ్యాలు ఇంకా మెరుగుపరిచేందుకు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. అనంతరం ఆయన తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొని విద్యార్థులు,తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల మాడల్ గా మండల కేంద్రాల్లో 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణాలు చేసేందుకు శ్రీకారం చుట్టిందని ఇందులో భాగంగా నిజాంసాగర్ మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. అర్హులైన ప్రతి పేద వారికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యం వీడి లబ్దిదారులకు సహకరించాలని కోరారు. అదే విధంగా బంజపల్లి పల్లె పకృతి వనం నర్సరీని పరిశీలించి మొక్కలు ఎండిపోకుండా నీళ్ళు పట్టాలని అధికారులను సూచించారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు,జిల్లా క్వాలిటీ కో ఆర్డినేటర్ వేణుగోపాల్, తహశీల్దార్ బిక్షపతి,ఎంపీడీవో గంగాధర్,ఎంఈఓలు తిరుపతిరెడ్డి,అమర్ సింగ్, హౌసింగ్ పిడి విజయ్ పాల్ రెడ్డి,డిఈ గోపాల్,మండల స్పెషల్ ఆఫీసర్ ప్రమీల,ఎంపీఓ అనిత,ఏపీవో శివకుమార్ ప్రధానోపాధ్యాయులు వెంకట్ రామ్ రెడ్డి,రామచందర్,కాల్ సింగ్,రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా,పంచాయతీ కార్యదర్శులు భీమ్ రావు, తుకారం,కారోబార్ సాయిలు, తదితరులు పాల్గొన్నారు.


