

పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- భద్రదికొత్తగూడెం, పినపాక మండలం ఇ.బయ్యారం క్రాస్ రోడ్లో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో అధికంగా ఇసుక నిల్వలు ఉండడంతో . ఇసుకకు అనుమతి ఉందా లేదా అని అనుమానంతో ఒక వ్యక్తి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం ద్వారా వెంటనే స్పందించిన రెవెన్యూ ,పోలీస్ యంత్రాంగం నిమిషాల వ్యవధిలోనే తహసిల్దార్ అద్దంకి నరేష్ బంకుకు చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు.అక్కడ ఉన్న ఇసుకకు ఎటువంటి అనుమతి లేకపోవడంతో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 20ట్రాక్టర్ల ఇసుకను, సంబంధిత జెసిబి ని సీజ్ చేశారు.ఇండియన్ ఆయిల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే పక్కనే ఉన్న ఇటుక బట్టిలో నిల్వ ఉంచిన ఇసుకను సైతం సీజ్ చేశారు. ఎవరైనా సరే ప్రభుత్వా నిబంధనలు ఉల్లంఘించి ఇసుక అక్రమ రవాణా చేపడితే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదన్నారు. మండలంలో ఎవరైనా ఎక్కడైనా సరే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లయితే తమకు సమాచారాన్ని ఇవ్వాలని తెలిపారు. ఇసుక అవసరమున్నవారు ర్యాంపు నుండి డిడి ద్వారా తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసీల్దార్ సమ్మయ్య , ఆర్ ఐ గణపతి, హెడ్ కానిస్టేబుల్ దిలీప్ కుమార్, సెక్రటరీ చంద్రకుమార్, తదితరులు పాల్గొన్నారు.
