
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కమాండంట్ వి వి ఎన్ ప్రసన్నకుమార్,ఆధ్వర్యంలో,విజయవాడ 10వ బెటాలియన్ NDRF,పర్యవేక్షణలో ఏలేరు నదీ
అప్పన్న వంతెన వద్ద మత్స్యకారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా NDRF సిబ్బంది వరదలు,వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,వాటర్ రెక్స్యూ, నీటిలో మునిగే వారిని ఎలా రక్షించాలి అనే వాటిపై,అవగాహన కల్పించారు.నీటిలో మునగ కుండ ఇంప్రూవైజ్డ్ డివైసెస్ ఎలా చేసుకోవాలి.తర్వాత CPR ఎలా అమలు చెయ్యాలి అనే వాటిపై విపులంగా వివరించారు.విపత్తుల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పై చర్చించారు.ఈ కార్యక్రమంలో ,ఇన్స్పెక్టర్ సుశాంత్ కుమార్ బెహరా,బృందం తాసిల్దార్ కుశరాజు, మండల మత్స్య శాఖ అధికారి రాజేంద్ర,ఆర్ ఐ పొన్నాలు, వి ఆర్ ఓ కిషోర్, ఆరోగ్య సిబ్బంది, పలువురు మత్స్యకార సంఘాల సభ్యులు,తదితరులు పాల్గొన్నారు