జ‌నసేన ఆవిర్భావ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన ఎమ్మెల్యే ఆర‌ణి

మనన్యూస్,తిరుప‌తి:ఈనెల 14వ తేదీన పీఠాపురంలో జ‌రిగే జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌తి ఒక్క‌రూ పాల్గొని విజ‌యవంతం చేయాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శ‌నివారం సాయంత్రం తిరుప‌తి నియోజ‌వ‌ర్గ స‌న్నాహ‌క స‌మావేశంలో ఛ‌లో పిఠాపురం పోస్ట‌ర్ ను ఆయ‌న ఆవిష్క‌రించారు. తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి జ‌న‌సైనికులు, వీర‌మ‌హిళ‌లు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు భారీగా జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వంలో పాల్గొన‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. బ‌హిరంగ స‌భ విజ‌య‌వంతంపై తిరుప‌తి పార్ల‌మెంట్ ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గ జ‌న‌సేన ఇన్చార్జీల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ప‌దకొండు ఏళ్ళ జ‌న‌సేన ప్ర‌స్థానంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని ఇటీవ‌లి సాధార‌ణ ఎన్నిక‌ల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి రికార్డు నెల‌కొల్ప‌డంలో పార్టీ చీఫ్, రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంకల్పమే కార‌ణ‌మ‌ని ఆయ‌న తెలిపారు. జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వ స‌భ నుంచి జ‌న‌సైనికుల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌శ‌దిశ నిర్థేశించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌న‌సేన న‌గ‌ర అధ్య‌క్షులు రాజారెడ్డి, కార్పోరేటర్లు సికే రేవ‌తి, నారాయ‌ణ‌, న‌ర‌సింహాచ్చారి,ఎస్ కే బాబు, పొన్నాల చంద్ర, న‌రేంద్ర‌, దూది శివ‌, ఆదం సుధాక‌ర్ రెడ్డి, యాద‌వ‌కృష్ణ‌, వెంక‌టేశ్వ‌ర రావు, హ‌రిశంక‌ర్, బాబ్జి, ప‌గ‌డాల ముర‌ళీ, జాన‌కిరామ్, ఆకేపాటి సుభాషిణి, కీర్త‌న‌, ఆకుల వ‌న‌జ‌, ల‌క్ష్మీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు