

మన న్యూస్,తిరుపతి, మార్చి 8:– మహిళలు రాజకీయాల్లోకి మరింతగా రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన ప్రతి హామిని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన చెప్పారు. శనివారం ఉదయం నగరంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముఖ్యంగా సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలో కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏపి హంస అసోషియేషన్ డిఎం అండ్ హెచ్ ఓ మీటింగ్ హాల్ లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే ఆరణి పాల్గొని మాట్లాడుతూ మహిళలు ప్రతి రంగంలో ప్రస్తుతం రాణిస్తున్నామరింత ప్రాతినిథ్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటిని చక్కదిద్దుతూనే ఉద్యోగంలో రాణించే నేర్పు, ఓర్పు మహిళల సొంతమని ఆయన కొనియాడారు. అనంతరం ఏపి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘంలో ఆధ్వర్యంలో పెన్షనర్స్ భవనంలో జరిగిన మహిళా దినోత్సవంలో పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తామన్నారు. రాస్ భవనంలో జరిగిన మహిళా దినోత్సవంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని ఎన్డీఏ ప్రభుత్వం నెరవేరస్తోందన్నారు. ఎంఎస్ ఎంఈ ల ద్వారా లక్షమందిని పారిశ్రామిక వేత్తలగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆశవర్కర్లకు జీతాలు, వయోపరిమితి పెంచడమే కాకుండా అంగన్వాడీలకు గ్రాట్యుటి ఇచ్చి ఎన్నికల హామీలను సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లు నెరవేరుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
