25ఏళ్ల కసి, కోపం, పగతో టీమిండియా – ఫైనల్‌ రివెంజ్ కోసం వెయిటింగ్!

Mana News :- సరిగ్గా 25 ఏళ్ల క్రితం అంటే 2000వ సంవత్సరం. ఆ రోజు కూడా ఫైనల్ మ్యాచే, ప్రత్యర్థి న్యూజిలాండే. కానీ ఫలితం మాత్రం భారత జట్టుకు వ్యతిరేకం. అయితే ఇప్పుడా ఓటమికి కసి తీర్చుకునేందుకు సిద్ధమైంది టీమిండియా.ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లో కివీస్ తో తలపడనుంది. మార్చి 9 ఈ తుది పోరు జరగనుంది.ఇదేం తొలిసారి కాదు.. :- అయితే భారత జట్టు, న్యూజిలాండ్ ఐసీసీ ఫైనల్స్‌లో తలపడటం ఇదేం తొలిసారి కాదు. గతంలో రెండు సార్లు ఫైనల్స్‌లో ఢీ కొన్నాయి. మొదటగా 2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీ ఫైనల్. ఈ పోరులో భారత్ పై న్యూజిలాండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో క్రిస్ కెయిర్న్స్ అద్భుత సెంచరీతో (113 బంతుల్లో 102) మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి విజయాన్ని లాగేసుకున్నాడు. అప్పుడు భారత జట్టుకు గంగూలీ సారథిగా వ్యవహరించగా, న్యూజిలాండ్ కు స్టీఫెన్ ఫ్లెమింగ్ సారథిగా వ్యవహరించాడు. మొదట భారత జట్టు 50 ఓవర్లలో 264/6 చేయగా.. అందులో గంగూలీ 117 శతకం బాదాడు. సచిన్ 69 పరుగులు చేశాడు. అయితే మిడిలార్డర్ లో రాహుల్ ద్రావిడ్, వినోద్ కాంబ్లీ, యువరాజ్ సింగ్ విఫలయమ్యారు. అనంతరం భారత జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని కెయిర్న్స్ సాయంతో న్యూజిలాండ్ ఛేదించింది. అయితే ఈ టోర్నమెంట్ తర్వాత నుంచి ఇప్పటివరకు న్యూజిలాండ్ ఒక్క వైట్-బాల్ ఐసీసీ టైటిల్ కూడా సాధించలేదు. 2015, 2019 ప్రపంచ కప్ ఫైనల్స్‌ కు చేరుకున్నప్పటికీ పరాజయాన్ని అందుకుంది.రెండో సారి ఎప్పుడంటే :- 2021 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లోనూ న్యూజిలాండే విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. అలా రెండు సార్లు కివీస్ పై ఐసీసీ టోర్నీల్లో మనం ఓడిపోయాం. దీంతో ఈ సారి ఎలాగైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. గ్రూప్ స్టేజ్‌లో ఇప్పటికే..:-ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ స్టేజ్‌ ఆఖరి లీగ్ మ్యాచ్ లో కివీస్ – జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారతే గెలిచింది. కానీ న్యూజిలాండ్ మాత్రం మనోళ్లపై గట్టిగానే ఒత్తిడిని తీసుకొచ్చింది. కాబట్టి ఈ సారి కూడా ఫైనల్ లో కివీస్ ను తక్కువ అంచనా వేయలేం.

Related Posts

రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, 15 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన మణికొండ మ్యాచ్ పాయింట్ అకాడమీ క్రీడాకారులు

నాగోల్ మన న్యూస్ ;- తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిజెఆర్ జిహెచ్ఎంసి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, అండర్ 15 టోర్నమెంట్ లో మణికొండ మ్యాచ్ పాయింట్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్స్ తమ సత్తా…

సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు విజేతగా నిలిచి 40 వేల రూపాయలు గెలుపు పొందడం జరిగింది. ఎస్ఆర్ పురం మండలం u.m. పురం గ్రామంలో నిర్వహించిన సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్లో యు.ఎం. పురం క్రికెట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 2 views
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

  • By JALAIAH
  • September 10, 2025
  • 2 views
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

  • By RAHEEM
  • September 10, 2025
  • 6 views
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 7 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 10, 2025
  • 6 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు