

Mana News :- ఇంటర్నెట్ డెస్క్: అంచనాలకు తగ్గట్టుగా ఈ సారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) హోరాహోరీగా సాగుతోంది. కొన్ని జట్లు పేలవ ప్రదర్శన చేసిన ఆటగాళ్లు మాత్రం అదరగొడుతున్నారు. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు ఏకంగా 14 సెంచరీలు నమోదయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఒక సీజన్‌లో ఇదే అత్యధికం. విల్ యంగ్, టామ్ లేథమ్, తౌహిద్ హృదోయ్, శుభ్‌మన్ గిల్, రికెల్‌టన్, బెన్ డకెట్, జోష్ ఇంగ్లిస్, విరాట్ కోహ్లీ, రచిన్ రవీంద్ర, ఇబ్రహీం జద్రాన్, జో రూట్, కేన్ విలియమ్సన్, డేవిడ్ మిల్లర్ సెంచరీలు బాదారు. న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర రెండు శతకాలు సాధించాడు. ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లోనూ శతకాలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ సెంచరీ చేసే ఛాన్స్ ఉంది. న్యూజిలాండ్ బ్యాటర్లు కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర మరోసారి శతక్కొట్టే అవకాశాలున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్‌లో టీమ్ఇండియా తరఫున ఒక్కడే సెంచరీ బాదాడు. ఆ ఒకే ఒక్కడు ఎవరంటే మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly). భారత్ తరఫున దాదా మినహా ఎవరూ ఐసీసీ టోర్నీల్లో మూడంకెల స్కోరు అందుకోలేదు. దాదా ఎప్పుడు చేశాడంటే? 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నైరోబీ వేదికగా జరిగింది. ఈ టైటిల్ పోరులో భారత్ చివరి వరకు పోరాడి ఓడింది. కెప్టెన్ సౌరభ్ గంగూలీ (117; 130 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకం బాదాడు. ఐసీసీ టోర్నీల్లో భారత్ తరఫున నమోదైన ఏకైక సెంచరీ ఇదే. ఆ మ్యాచ్‌లో సచిన్ (69) కూడా రాణించడంతో భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. క్రిస్ కెయిర్న్స్ (102) శతకానికితోడు క్రిస్ హారిస్ (46), నాథన్ ఆస్లే (37) పరుగులు చేయడంతో కివీస్ రెండు బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. ఆ అవార్డూ ఒక్కడికే :- భారత్ ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీ ఐదుసార్లు ఫైనల్‌కు చేరింది. 2002లో భారత్, శ్రీలంక సంయుక్త విజేతలుగా నిలవగా.. 2013లో ఇంగ్లాండ్‌ను ఓడించి టీమ్ఇండియా ఛాంపియన్‌గా అవతరించింది. ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో భారత్ తరఫున అత్యధిక స్కోర్లు చేసిన బ్యాటర్లు :-వీరేంద్ర సెహ్వాగ్ – 82; 81 బంతుల్లో (ఆస్ట్రేలియాపై, 2003 వన్డే ప్రపంచ కప్ ఫైనల్), సౌరభ్ గంగూలీ – 117; 130 బంతుల్లో (న్యూజిలాండ్‌పై, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2000 ఫైనల్) ,గౌతమ్ గంభీర్ – 97; 122 బంతుల్లో (శ్రీలంకపై, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్) ,మహేంద్ర సింగ్ ధోనీ – 91*; 79 బంతుల్లో (శ్రీలంకపై, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్) ,అజింక్య రహానె – 89; 129 బంతుల్లో (ఆస్ట్రేలియాపై, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్, తొలి ఇన్నింగ్స్‌లో)
