

నాగోల్ మన న్యూస్ ;- తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిజెఆర్ జిహెచ్ఎంసి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, అండర్ 15 టోర్నమెంట్ లో మణికొండ మ్యాచ్ పాయింట్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్స్ తమ సత్తా చూపించారు. మే 2 నుండి మే 4 వరకు వరకు జరిగిన ఈ టోర్నమెంట్ లో దాదాపు 400 మందికి పైగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా నాగిరెడ్డి సాహితీ శ్రీ, శౌర్య తేజ్ బొడిగపు జోడి అండర్ 15 మిక్సడ్ డబుల్స్ విభాగంలో గోల్డ్ మెడల్ గెలుపొందారు. వీరు ఫైనల్స్ లో సిద్దార్థ్ సాయి, దివ్య జోడి మీద 15/11,15/09 తో గెలుపొందారు. అలాగే నాగిరెడ్డి సాహితి శ్రీ అండర్ 15 గర్ల్స్ సింగిల్స్ ఫైనల్ లో శృతి చేతిలో 15/13,15/12 తో పోరాడి ఓడిపోయి సిల్వర్ మెడల్ తో సరి పెట్టుకుంది. అలాగే అండర్ 13 బాయ్స్ డబుల్స్ ఫైనల్స్ లో మ్యాచ్ పాయింట్ క్రీడాకారులు జునుగు అభిషేక్, ఆది రుత్విక్ జోడి దీపక్ నాయుడు, చరణ్ తేజ్ ఆకుల జోడి మీద అధ్బుతమైన ఆటతో 15/07,15/13 వరుస సెట్ల లో గెలుపొంది గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు.ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న మూడు ఈవెంట్స్ లో మూడు మెడల్స్ సాధించిన మ్యాచ్ పాయింట్ క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ సుమిత్ రెడ్డి మెడల్స్ సాధించిన వారిని శాలువా కప్పి సత్కరించారు. ట్రోఫీస్ తో పాటు సర్టిఫికెట్, క్యాష్ అవార్డ్ కూడా బహుకరించారు. మ్యాచ్ పాయింట్ అధినేత, హెడ్ కోచ్ వేణు ముప్పాల మాట్లాడుతూ మ్యాచ్ పాయింట్ నుండి పాల్గొన్న అందరికి మెడల్స్ రావడం చాలా సంతోషంగా ఉంది అని, దీనికి అంతర్జాతీయ క్రీడాకారులు, కోచ్ జెబిఎస్ విద్యాధర్, బివిఎస్ కె లింగేశ్వర రావు ఇచ్చిన అద్భుతమైన కోచింగ్ వల్లనే సాధ్యం అయిందని తెలిపారు. ప్రొఫెషనల్ గా బ్యాడ్మింటన్ నేర్చుకోవాలంటే మ్యాచ్ పాయింట్ కి రావాలని పిలుపునిచ్చారు.