

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు విజేతగా నిలిచి 40 వేల రూపాయలు గెలుపు పొందడం జరిగింది. ఎస్ఆర్ పురం మండలం u.m. పురం గ్రామంలో నిర్వహించిన సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్లో యు.ఎం. పురం క్రికెట్ జట్టు పై పెద్దతయ్యూరు జట్టు విజయం సాధించడం జరిగింది. గెలుపొందన జట్టుకు 40,000 రూపాయలు, రన్నర్ చెట్టుకు 20వేల రూపాయలు బహుమతితో పాటు మెడల్స్ కప్పును అందించడం జరిగింది. మెన్ అఫ్ ది సిరీస్ సురేష్, మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అనిల్ , బెస్ట్ బౌలర్ కోదండయ్య , బెస్ట్ బ్యాట్స్మెన్ నరేష్ లకు అవార్డులు అందించారు.గెలుపొందిన పెద్ద తయ్యూరు జట్టుకు ఆ గ్రామంలో మంగళ హారతులతో బాణా సంచులతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ వరదమ్మ గెలుపొందిన క్రీడాకారులు సన్మానించి అభినందించారు. మానసిక మానసిక ఉల్లాసంతో పాటు యువతుల్లో దాగున్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్ దోహదపడతాయని అన్నారు. పంచాయతీ స్థాయిలో క్రీడ మైదానానికి కృషి చేస్తారని సర్పంచ్ వరదమ్మ క్రీడాకారులకు హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులు, యువకులు అందరూ కలిసి ఉత్సాహంగా చిందులేశారు.