

Mana News :- వేసవిలో తాగునీటి సమస్యపై అలసత్వం వద్దని అధికారులకు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయం నుంచి RWS అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి సమస్య నివారణకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. పంచాయతీల వారీగా తాగునీటి సరఫరాపై అవగాహన కలిగి ఉండాలన్నారు. నీరు కలుషితం కాకుండా చూసుకోవాలని సూచించారు.