

Mana News :- తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నాల్గవ సౌత్ జోన్ షూటింగ్ బాల్ చాంఫియన్ షిప్ పోటీల్లో రామకుప్పం మండలంలోని బళ్లకు చెందిన విద్యార్థి మౌనిశ్ విశేష ప్రతిభ కనబరచాడు. సీనియర్ విభాగంలో ఇతను విజేతగా నిలిచాడు. ఇతను ఎస్వీయులో డిగ్రీ చదువుతున్నాడు. పోటీల్లో ప్రతిభ చాటిన మౌనిశ్‌ను బుధవారం స్థానిక టీడీపీ నేతలు మునస్వామి, నాగభూషణం, పట్ర నారాయణ, జయశంకర్, మునిరత్నం తదితరులు అభినందించారు.