

యువకులు క్రీడాల్లో రాణించాలి
-: సాయిరాం యదావ్ కు సన్మానం
-: క్రీడలో ఉత్సాహంగా యూవత
మన న్యూస్ లింగంపెట్ జనవరి 15:25 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, లింగంపల్లి గ్రామంలో
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రామంలో వాలీబాల్ పోటీలు నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్ల సాయిరాం యాదవ్ అన్నారు. గ్రామంలో సంక్రాతి సంబరాలు పురస్కరించుకొని యువకులను ఉత్సాహ పరిచెదుకు యువత క్రీడలో ముందు ఉండాలనే ఉద్దేశంతో వాలిబల్ పోటీలు నిర్వహించారు. ఈ వాలీబాల్ పోటిల్లో 12 జట్లు పాల్గొనగా, మొదటి బహుమతి ఛత్రపతి శివాజీ యూత్, రెండవ బహుమతి హైందవ సేన యూత్, మూడవ బహుమతి అంబేద్కర్ యువజన సంఘం, గెలుపొందడం జరిగిందన్నారు.వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు శేఖర్, అఖిలేష్ యాదవ్, క్రీడాకారులు, గ్రామ యువకులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వాలిబాల్ పోటీ నిర్వాహకులు సాయిరాం యాదవ్ ని గ్రామస్తులు శాలువాతో సన్మానించారు.