filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 7864320;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 39;

మన న్యూస్,కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టార్ హాస్పిటల్ నందు రవీందర్ రెడ్డి అనే డాక్టర్ పేరుతో నకిలీ డాక్టర్ సర్టిఫికెట్,అదార్ కార్డులతో వైద్యం చేస్తున్న ముల్కల రవీందర్ అనే నకిలీ డాక్టర్ ను అరెస్ట్ చేసినట్టు కామారెడ్డి అసిస్టెంట్ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు.
ముల్కల రవీందర్ అనే నకిలీ డాక్టర్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోదాం రోడ్డులో గల స్టార్ ఆసుపత్రి నందు పిల్లల డాక్టర్ గా వైద్యం చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా రవీందర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేసినట్టు తెలిపారు.ఇతను గాంధీ మెడికల్ కళాశాల నందు MBBS చేస్తున్నట్టు చెప్పి ఆన్ లైన్ లో మెడికల్ కౌన్సిల్ ఇచ్చే సర్టిఫికెట్ లను డౌన్ లోడ్ చేసుకుని ఆయన పేరుకు దగ్గరగా ఉన్న రవీందర్ రెడ్డి అనే డాక్టర్ సర్టిఫికెట్ లో పేరు మార్చిన నకిలీ డాక్టర్ గా వైద్యం చేస్తున్నారని తెలిపారు. ఇతను కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదని, ఇతని స్వస్థలం రామకృష్ణపూర్ గ్రామం మందమర్రి మండలం,మంచిర్యాల జిల్లా అని తెలిపారు. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ దండెం లాలయ్య కుమార్ ఫిర్యాదు మేరకు ఇతన్ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇతడు MD జనరల్ మెడిసిన్, పిల్లల డాక్టర్ గా గతంలో పలు ఆసుపత్రుల్లో వైద్యం చేసినట్టు తెలిపారు.కేవలం డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ప్రజల ప్రాణాలతో,ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు.ఇతనిపై పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసి, అతని వద్ద నుండి నకిలీ ఆదార్ కార్డు,నకిలీ డాక్టర్ ధ్రువపత్రాలను, ఒక ల్యాప్ టాప్,మొబైల్ ఫోన్ స్వాదీనం చేసుకుని న్యాయస్థానం ముందు హాజరు పరచడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ చంద్రశేఖర్,రూరల్ సీఐ రామన్,ఎస్సై లు రాజు,సాయి రాం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *