

మన న్యూస్,జుక్కల్, పిట్లం మండల కేంద్రంలోని అకోలా నాందేడ్ 161రహదారి వద్ద ఎస్ఐ రాజు వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు.ఈ సందర్భంగా ఎస్ ఐ రాజు మాట్లాడుతూ.వాహనదారులు నడిపించే వ్యక్తులు ప్రతి ఒక్కరూ వారి వెంట లైసెన్సు,ఇన్సూరెన్స్ ,హెల్మెట్ తప్పనిసరిగా ధరించి బైకు నడిపించాలని అన్నారు.హెల్మెట్, ఇన్సూరెన్స్ లేకపోయినా వాహనదారులకు జరిమానా విధించడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు.ప్రతి ఒక్కరూ వాహనం నడిపించే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని హెల్మెట్ ధరించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.కారు నడిపించే వాహనదారులు సీట్ బెల్టు కచ్చితంగా పెట్టుకొని నడిపించాలని అన్నారు. సెల్ పోన్ లో మాట్లాడుతూ వాహనాలు నడిపించకూడదని హెచ్చరించారు. ఎస్ఐ వెంట ఏఎస్ఐ లింబాద్రి, పోలీస్ సిబ్బంది రవి మారుతి నవీన్ తదితరులున్నారు.