

మన న్యూస్,రామారెడ్డి: మండల అభివృద్ధికి కృషి చేయాలని మండలానికి ఎంపీ నిధులను కేటాయించి మండలాభివృద్ధికి కృషి చేయాలని ఆదివారం జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి,కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు గి రెడ్డి మహేందర్రెడ్డి జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం సభ్యులు సురేష్ షెట్కర్ కు వినతి పత్రం అందజేశారు.ఎంపీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి,మండలంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధి తో పాటు,మండల అభివృద్ధికి నిధులు కేటాయించి కృషి చేయాలని కోరినట్లు వారు తెలిపారు.కార్యక్రమంలో మండల వాసులు నా రెడ్డి మహిపాల్ రెడ్డి,బండి పోచయ్య,సుద్దాల లింగం,టంకరి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.