మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ ,వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మద్నూర్ ఎంవిఐ సుభాష్ అన్నారు.ఆదివారం జాతీయ రహదారి 161 సంగారెడ్డి- అకోలా రోడ్డు భద్రత మసోత్సవాల సందర్భంగా వాహనాలను తనిఖీ చేశారు. డ్రైవర్లకు అవగాహన కల్పించడంతోపాటు స్టిక్కర్లను కూడా అతికించడం జరిగిందన్నారు.ఆయన మాట్లాడుతూ.. రోడ్లపై వాహనదారులు రోడ్ల భద్రత నియమాలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చు అని అన్నారు. వాహనదారులు బయటకు వెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులు వేయికళ్లతో ఎదురు చూస్తుంటారని ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, కారు నడిపే వాహనదారులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని డ్రైవర్లకు సూచించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జాతీయ రోడ్డు మసోత్సవాలు జనవరి 1 తేదీ నుంచి 31 తేదీ వరకు కొనసాగుతాయిన్నారు. ఎఎంవిఐ రజినీ, చెక్ పోస్ట్ సిబ్బంది మోహిన్ తదితరులు ఉన్నారు.
