

మన న్యూస్:పినపాక,సమాజంలోని పేదలకు సేవచేయాలనే తపన అందరిలో రావాలని ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.బుధవారం’ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’సభ్యులు, కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో పినపాక మండలంలోని అమరారం గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టతోగు వలస ఆదివాసీ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఐ ముఖ్య అతిథిగా పాల్గొని సుమారు 30 కుటుంబాలకు దోమ తెరలు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.సమాజ సేవలో ఎనలేని సంతృప్తి దాగివుంటుందని ప్రతీ ఒక్కరూ ప్రస్తుత రోజుల్లో అభాగ్యులకు ఏదో రూపంలో అండగా నిలబడలన్నారు.ఎస్సై రాజ్ కుమార్ మాట్లాడుతూ ఏజెన్సీలో ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ వారి సేవలు అభినందనీయంమని ప్రసంసించారు.అనంతరం ఫౌండేషన్ సభ్యులు సోందుపాషా మాట్లాడుతూ.ప్రజల అవసరాలను గుర్తించి రానున్న రోజుల్లో పేదలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఏడూళ్ళ బయ్యారం ఎస్సై రాజ్కు మార్,ఫౌండేషన్ సభ్యులు షేక్ వసీం అక్రం, పోలీస్ సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.