

వింజమూరు సెప్టెంబర్ 14 🙁 మన ద్యాస న్యూస్)ప్రతినిధి నాగరాజు ://
వింజమూరు మండల కేంద్రం లో మాజీ డి.ఎం.హెచ్.ఓ డా|| మాసిలమణి ఆధ్వర్యంలో నడుస్తున్న మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్ ను గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన, ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. చక్కటి వాతావరణంలో చిన్న పిల్లలకు నామమాత్రపు ఖర్చులతో సేవలు అందిస్తున్న మాశిలమణి గారిని ఎమ్మెల్యే గారు అభినందించారు.మన వింజమూరు పట్టణంలో కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడానికి, జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కిమ్స్ విభాగాన్ని హాస్పిటల్‌లో గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వింజమూరు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.