మన న్యూస్:భద్రాద్రి కొత్తగూడెం,జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బి.కోటేశ్వరరావు ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించారు. గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తమ కార్యాలయంలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి 8,58,320/-రూపాయల చెక్కును అందజేశారు.భద్రతా విభాగం నుంచి ఎక్స్గ్రేషియా రూపంలో ఈ నగదును వారికి అందజేయడం జరిగిందని తెలియజేశారు. హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు కుటుంబ ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటూ ఎప్పటికప్పుడు తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ సత్యానారాయణ,ఆర్ఐలు లాల్బా బు,కృష్ణారావు,జిల్లా కార్యాలయ ఏవో అజ్మీరా మంజ్యా నాయక్,సూపరిండెంట్ సత్యవతి,జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *