

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వెలిసి ఉన్న అమ్మ వారి ప్రాంగణంలో దసరా సందర్బంగా శ్రీ శ్రీ శ్రీ కనక దుర్గమ్మ వారి దేవీ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా అర్చక స్వాములు ఆధ్వర్యంలో జరిగిన పందిరి రాట ముహూర్త కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులుమరియు యు.వి.ఆర్ చైర్మన్ ఉమ్మడి వెంకట్రావు పద్మ దంపతులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దంగేటి రామలక్ష్మి, అలమండ దుర్గాప్రసాద్, ఊర కృష్ణమూర్తి, పగలపాటి కామేష్,గుత్తుల భ్రమరాంబిక,తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.