మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):డోంగ్లీ మండలంలోని మొఘ గ్రామానికి చెందిన బీజేపీ యూత్ అధ్యక్షులు, యువ నాయకులు, కార్యకర్తలు గురువారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీని వీడి, ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ –యువత కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభపరిణామం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓట్ల దొంగతనం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ప్రజల హక్కులను కాలరాస్తూ, ప్రజాస్వామ్యాన్ని మంటకలుపుతున్న బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పి గద్దె దించే వరకు మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి మద్దతుగా నిలుస్తూ పోరాడాలి” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *