

గ్రామీణ కళలను ప్రోత్సహించాలి. కళాకారులకు పెన్షన్లు ఇళ్లపట్టాలు మంజూరు చేయాలి.
ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని ఇంద్రావతి గ్రామానికి చెందిన బోయ సంజప్పను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం గవి మఠంలో ఉరగాద్రి కళాపీఠం అధ్యక్షులు, గ్రామీణ సేవా సమితి తాలూకా అధ్యక్షులు, కాకతీయ సేవా సమితి అధ్యక్షులు మాలపాటి శ్రీనివాసులు సన్మానించారు. సంజప్పను శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మాలపాటి శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామీణ కలలు అన్న కళాకారులన్నప్పటికీ సంజప్పకు ఎంతో ప్రీతి. గోకులాష్టమి సందర్భంగా శనివారం పెన్నోబిలం దేవస్థానం కళాక్షేత్రంలో జరిగే గ్రామీణ ఆణిముత్యాలు కార్యక్రమానికి సంబంధించి కళాకారులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. నిస్వార్థ సేవ, కళా పిపాసి, సామాజిక స్పృహ, ఆధ్యాత్మిక చింతన అధికంగా కలిగిన సన్యప్పను సన్మానించడం అంటే గ్రామీణ కళాకారులను సన్మానించడమే అవుతుంది.
ఈ సందర్భంగా సన్ జఫ్ఫా మాట్లాడుతూ అంతరించి పోతున్న కళలను టిడిపి ప్రభుత్వం ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. కళాకారులకు ఇళ్ల పట్టాలు, పెన్షన్లు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ ను ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.