

కలిగిరి మన న్యూస్ ప్రతినిధి ఆగస్టు15:///
ఈరోజు 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవము సందర్బంగా మండల ప్రజా పరిషత్ ప్రాధమిక పాఠశాల – రావులకొల్లు నందు భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వీట్స్ మరియు చాక్లెట్స్ పంచిపెట్టారు. అనంతరం స్వాతంత్రోధ్యమ అమరవీరులకు, మహనీయులకు ఘనంగా నివాళులు అర్పించరు.పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ చిగురుపాటి అనిత వున్నారు.ఈ కార్యక్రమం కి ముఖ్య అతిధిలు గా పాల్గొన్న గ్రామ సర్పంచ్ శ్రీపూసాల వెంగపనాయుడు , అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు చేసిన తాగాలను గుర్తు చేస్తూ వారు చేసిన ప్రాణ త్యాగాలను గురించి వివరించారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరం పనిచేయాలని దేశభక్తిని భాయతరాలకు అందించే దిశగా కృషి చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో,ఏపినాపి సర్పంచ్ శ్రీవరప్రసాద్ , రావులకొల్లు గ్రామ ఉప సర్పంచ్ పూసాల మాల్యాద్రి నాయుడు, ప్రధానోపాధ్యాయులు గాదిరెడ్డి మురళీకృష్ణ, రావులకొల్లు పంచాయతీ సెక్రటరీ శ్రీ షేక్ ముతహర్, వేపినాపి పంచాయతీ సెక్రటరీ శ్రీ. పి. నరేంద్ర, మరియు పోలంపాడు సచివాలయం సిబ్బంది, రావులకొల్లు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీ రాఘవులు, గ్రామ వార్డ్ మెంబర్స్, పంచాయతీ సిబ్బంది కర్ర క్రిష్టయ్య, శ్రీమతి చిగురుపాటి శ్యామల మరియు గ్రామప్రజలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.