

కలిగిరి ఆగస్టు 16 మన న్యూస్ ప్రతినిధి :///
కలిగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురు గా సర్ధార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమం జై గౌడ ఉద్యమం అధ్యక్షులు పంది మాల్యాద్రి గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం ఆయన స్వాతంత్ర సమరయోధుడు సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..1909 ఆగస్టు 16న ఆనాటి గంజాం జిల్లా సోంపేటలోని ఒక మారుమూల పల్లెలో జన్మించిన గౌతు లచ్చన్న తనదైన పోరాటాలతో సర్దార్ అనిపించుకున్నారు. ఆయన బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం జీవితకాలం అంతా పోరాడారు.ఆయన జీవితమంతా ప్రజా పక్షానే ఉన్నారు.అధికారంలో ఉన్నా లేక ప్రతిపక్షంలో ఉన్నా కూడా తాను సిసలైన ప్రజా నాయకుడిని అని ఎలుగెత్తి చాటారు. బడుగులు కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని హక్కులు అందుకోవాల్సిన వారే అని లోకానికి చాటడమే కాదు ఏలిన వారి కళ్ళు తెరిపించి వారికి ఉన్నత మార్గాలను చూపించిన దార్శనీకుడిగా నిలిచారు…అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.ఆయన సంఘ సంస్కర్తగా ఆధునిక రాజకీయ యోధుడిగా చరిత్రలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం పదవులు సైతం తృణ ప్రాయంగా త్యజించారు. అందుకే ఆయన అనేక పార్టీలలో చేరినా బయటకు వచ్చేసేవారు. ఇక ఆయన ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పాటు అయితే తొలి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అలా ఆయన రాజాజీ ప్రకాశం పంతులు మంత్రివర్గంలో పనిచేసారు.గౌతు లచ్చన్న ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన కోరారు. అనంతరం అక్కడే ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు బిస్కెట్లు సాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ్ మిత్రులు, మహేష్, జై కృష్ణ, గౌస్ ఫిర్, జిలాని, తదితరులు పాల్గొన్నారు.