మన న్యూస్,మర్రిపాడు/ఆగష్టు 15 :///
మర్రిపాడు మండల కేంద్రంలో భీమవరం సొసైటీ కార్యాలయం వద్ద సొసైటీ చైర్మన్ ఎర్రమళ్ళ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సందర్భంగా బీమవరం సొసైటీ కార్యాలయం ఎదుట త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జండా వందనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ ఎర్రమళ్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ ఎంతోమంది మహావీరుల యొక్క త్యాగానికి ప్రతిఫలమే స్వాతంత్ర దినోత్సవం అని వారి యొక్క త్యాగాలకు ప్రతీకగా వచ్చిన స్వతంత్రాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా మలుచుకుంటూ శాంతి, అహింస అనే మంచి మార్గాలను ఎంచుకుని మంచి నడవడికతో మలుచుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.