

మన న్యూస్,తిరుపతి, రాష్ట్ర సమాచార కమిషనర్, సహకార శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం స్థానిక కెనడీ నగర్ లోని డివిజనల్ సహకార శాఖ అధికారి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005 పైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. సదరు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా సహకార అధికారి ఎస్వీ నాగవర్ధన హాజరై సమాచార హక్కు చట్టం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అలాగే జిల్లా సహకార ఆడిట్ అధికారి శ్రీ బ్రహ్మానంద రెడ్డి హాజరై సమాచార హక్కు చట్టం యొక్క విధివిధానాలు పూర్తిగా అమలు చేయాలని చెప్పారు . ఈ కార్యక్రమంలో నగర డివిజనల్ సహకార అధికారి సురేష్ కుమార్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం నియమ నిబంధనల ప్రకారం అభ్యర్థులు కోరిన సమాచారాన్ని నిబంధనల మేరకు పరిమితులకు లోబడి ఇవ్వాలని అలాగే వారికి సరైన సమయంలో వారు కోరిన సమాచారం ఇవ్వాలని తెలిపారు . సమాచార హక్కు చట్టం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి అంశాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి డివిజన్ లోని సహకార శాఖ అధికారులు సిబ్బంది, సహకార సంఘాల సిబ్బంది, సీఈవోలు ఇతరులు కూడా హాజరయ్యారు. అంతేకాకుండా సమావేశం అనంతరం ఒక ర్యాలీగా తిరుపతి పురవీధులలో సమాచార హక్కు చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగినది.