

గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణంలోని రైతు బజారు ప్రక్కన ఉన్న శ్రీ ధర్మారాజ స్వామి దేవస్థానం భూమి తాత్కాలిక వ్యాపారానికి కేటాయింపులో నిబంధనలు పాటించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.స్థలం కేటాయింపు విధానం లో శాఖా పరమైన ప్రక్రియ వివరాలు వెల్లడించడంలో దేవాదాయ శాఖ అధికారుల వివరణ పొంతన లేని విధంగా ఉంది. అధికారిక ఉత్తర్వులు వెల్లడించడం లో సరైన విధంగా స్పందించడం లేదు. ఏ వ్యాపారికి ఏ ప్రాతి పదికన ఎంత కాలానికి ఎంత అద్దెకు ఇప్పుడు కేటాయించారనే వివరాలు వెల్లడించడం లో మీన వేషాలు లెక్కిస్తున్నారు. అద్దె కు కేటాయించినట్లు ఈఓ రవికృష్ణ చెబుతున్న వ్యక్తి అదే శాఖలో ఓ అధికారి వద్ద తాత్కాలికంగా పనిచేసే వాహన చోదకుడు కావడం గమనార్హం. ఇదిలా ఉండగా వివాదాస్పదం గా కేటాయించబడిన స్థలంలో బుధవారం నుంచి శరవేగంగా తాత్కాలిక నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
