ఎన్నికలలో నిరుద్యోగులకు ప్రతినెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది హామీ
అమ్మ ఒడి 15000 ఇస్తామని 13000 ఇవ్వడం సిగ్గో సిగ్గు
ఉరవకొండ మన ధ్యాస :
సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ రేపు జరగబోయే విజయోత్సవ సందర్భంగా విద్యాసంస్థలు సెలవు ఇవ్వడాన్ని అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సీఎం సిద్దు ఖండించారు. విద్యార్థి సంఘాలు ప్రభుత్వ పాఠశాలలోకి అనుమతులు లేవంటూ జీవోలను రద్దుచేసి గత ప్రభుత్వం విద్యాదీవెన,వసతిదీవన నిధులు రూ.6,400కోట్ల రూపాయులు పెండింగ్ లో ఉంచిందని దీని వలన చదువులు పూర్తిచేసిన విద్యార్దులు సర్టిఫికేట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారన్నారు.పలు యూనివర్శిటీలలో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న నేపధ్యంలో ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతి ఇస్తామని యాజామాన్యాలు విద్యార్ధులపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. నూతన ప్రభుత్వం బకాయిల విడుదల విషయంలో జాప్యం చేస్తుందని కల్లబొల్లి మాటాలు చెప్తుందని వాపోయారు.వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేసారు.ఎన్నికల హామీలో భాగంగా తల్లికివందనం పధకం ఇచ్చారన్నారు.పథకం ఈ విద్యాసంవత్సరం అమలు చేస్తారో లేదో అన్న గందరగోళం నెలకొన్నదని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం అమలుపై స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా జీఓ నెం:77 వలన పీజీ చదువులకు విద్యార్ధులు దూరం అవుతున్నారని వచ్చిన వంద రోజుల్లోనే రద్దు చేస్తామని యువగళం పాదయాత్రలో నేటి విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చారన్నారు.కానీ జిఓ రద్దు గురించి పలుమార్లు అడిగిన వాటి ఊసేలేదన్నారు.ఎంతో అర్భాటంగా తీసుకొచ్చిన డిగ్రీ హానర్స్ విధానం విద్యార్ధుల పాలిట శాపంగా మారిందని విద్యార్ధికి కోర్సు ఎంపిక చేసే హక్కును కాలరాసిందని అన్నారు.వెంటనే విధానంను రద్దు చేయాలని కోరారు.ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని,హాస్టళ్ళ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుందని, సొంత భవనాలు లేకపోవడంతో చాలిచాలని వసతులతో విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అన్నా క్యాంటీన్‌లకు ప్రభుత్వం రూ.96 కేటాయిస్తున్నది.భావితరాలు చదువుకునే హాస్టళ్ళకు రోజుకి రూ.53 (కళాశాల), రూ.46 (పాఠశాల) ఇస్తుంది. ఇవి కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా రోజుకి మెస్‌బిల్లు రూ.100కి పెంచి నెలకు రూ.3,000 ఇవ్వాలని డిమాండ్ చేసారు.అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా యూనివర్శిటీలలో అధ్యాపకులు లేక వర్శిటీలు వెలవెలబోతున్నాయన్నారు. చివరికి కోర్సులు ఎత్తివేస్తున్నారని 3,220 అధ్యాపక పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం నేటి వరకూ వాటి ఊసేలేదని అన్నారు.
విద్య రంగ సమస్యల పరిష్కరించినప్పుడు అప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అప్పుడు సంబరాలు జరుపుకోండి (ఏఐఎఫ్డిఎస్)అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సంఘం విజ్ఞప్తి చేస్తున్నాము







