

మన న్యూస్ తవణంపల్లి ఆగస్టు-13:- చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్ బుధవారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా 627 మంది ఆధార్ ఫీడింగ్ మరియు పట్టాదారులు మృతి చెందిన కారణంగా రైతు భరోసా నగదు అందలేదని దానిపై విచారణ చేపట్టారు. తాహసిల్దార్ సుధాకర్ని 48 గంటలలోపు వివిధ రకాల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించడం జరిగిందని జెసి అన్నారు. తవణంపల్లి మండలంలో సుమారు 750 మందికి ఉన్న సమస్యలను పరిష్కరించాలని అగ్రికల్చర్ ఆఫీసర్ను అధికారులను ఆదేశించడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.