


మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్), ఆగస్టు 5:
వనమహోత్సవాన్ని పురస్కరించుకొని మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ శివారులో ఉన్న సర్పాని చెరువు పరిసర ప్రాంతంలో ఈత మొక్కల నాటకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఎక్సైజ్ ఎస్సై శ్రావణ్ కుమార్, టి.ఏ. అప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ బాలరాజు పాల్గొని మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా ఎస్సై శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, “పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా మొక్కల నాటకం అత్యవసరం. ప్రత్యేకించి ఈత మొక్కలు భూమి ఆర్ద్రతను కాపాడటంలో, వాతావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తాయి. భవిష్యత్తు తరాల కోసం గ్రామాల చుట్టూ హరితవనం ఏర్పాటుచేయడం మన అందరి బాధ్యత” అని అన్నారు.గ్రామస్థులు సైతం ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని మొక్కలను నాటి హరితహారానికి తమ మద్దతును తెలిపారు.