

వరికుంటపాడు:(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
వరికుంటపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్త షేక్ పీరయ్యకు హాట్ స్టోక్ వచ్చిన వార్త తెలుసుకొని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పీరయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జరిగిన తీరును కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని అత్యవసరమైతే వైద్యశాలకు వస్తానని పీరయ్య కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భరోసానిచ్చారు. నేనున్నానని ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ఎవరు ధైర్య పడవద్దని భరోసానిచ్చారు.
ఫోన్ ద్వారా పీరయ్య కుటుంబ సభ్యులతో యోగక్షేమాలను అడిగి తెలుసుకుని వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ సిబ్బందికి ఆదేశించారు.