

కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
కలిగిరి మండలం వెలగపాడు గ్రామానికి చెందిన గడ్డం ప్రభుదాస్ దీనమ్మ దంపతుల కుమార్తె దివ్య, మరియు అదే గ్రామానికి చెందిన షేక్ రేష్మి వివాహాన్ని పురస్కరించుకొని, శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెళ్లి కానుకను, స్థానిక నాయకుల చేత అందజేయడం జరిగింది. ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు, పెళ్ళికానుకను అందజేసినట్లు నాయకులు తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ, అభాగ్యులకు చేయూతనందిస్తూ, పెళ్లి కుమార్తెలకు పెళ్ళికానుకలు అందజేస్తూ, నియోజకవర్గ ప్రజల పట్ల ఆపద్బాంధవుడుగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ నిలుస్తున్నారని నాయకులు ప్రశంసించారు. పెళ్లి కుమార్తెల తల్లిదండ్రులు ఆనంద వ్యక్తం చెందారు. ఆ గ్రామంలోని ప్రజలు కాకర్ల సురేష్ చేసే చేసే మంచి పనులకు సంతోషం వ్యక్తం చెందారు.