

దుత్తలూరు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
దుత్తలూరు మండలం బండకిందపల్లి గ్రామంలోని భోగిరెడ్డి శ్రీనివాసులురెడ్డి రమణమ్మ దంపతుల కుమార్తె కవితరెడ్డి గంధపు నలుగు కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పాల్గొని నూతన వధువును ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పెళ్ళికొడుకు వీరమోహన్ రెడ్డిని కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉండేలా గురువారెడ్డి, చీకుర్తి రవీంద్రబాబు, మల్లికార్జున్, అన్నపురెడ్డి వెంగళరెడ్డి, జూపల్లి రాజారావు, స్థానిక నాయకులు బంధుమిత్రులు తదితరులు ఉన్నారు.