బండ కింద పల్లి లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం,,ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

దుత్తలూరు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):

దుత్తలూరుమండలం బండ కింద పల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం దుత్తలూరు మండలం నాయకత్వంలో, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్చార్జిలా సారథ్యంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ప్రతి గడపకు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ను వివరించారు. గత వైసిపి పాలనకు నేటి చంద్రన్న పాలనకు వ్యత్యాసాన్ని వివరించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు నెలలో అన్నదాత సుఖీభవ ద్వారా రైతుల ఖాతాలో ఏడు వేల రూపాయలు జమ కానున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెంపు, ల్యాండ్ టైటిల్ యాక్టర్ రద్దు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్, ఉచిత ఇసుక పాలసీ, అమలు చేస్తున్నామన్నారు. త్వరలో మిగిలిన పథకాలను కూడా అమలు పరుస్తామని తెలిపారు. సంక్షేమ పథకాలను అమలు పరుస్తూనే, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తూ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. కనుక ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని తెలిపారు.
గ్రామంలోనికి చేరుకున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి మండలం మరియు గ్రామ నాయకులు ఘన స్వాగతం పలికి శాలువా పూల మాలలతో ఘనంగా సన్మానించారు. స్థానికులు వ్యక్తిగత సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటికి పరిష్కార మార్గాలను చూపారు.
ఈ కార్యక్రమంలో,సీనియర్ నాయకులు ఉండేలా గురువారెడ్డి, అన్నపురెడ్డి వెంగళరెడ్డి, చీకుర్తి రవీంద్రబాబు, చిదర్ల మల్లికార్జున, మండవ మధు, పావులూరు సుబ్బరాయుడు, కాకర్ల మధుసూదన్ రెడ్డి, మహేష్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ఆంధ్రప్రదేశ్ :(మన ద్యాస న్యూస్) : ప్రతినిధి నాగరాజు :/// ఆంధ్రప్రదేశ్లో నీ రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది కలెక్టర్లు ను బదిలీ చేసిన ప్రభుత్వం. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఓ ఆనంద్ నీ అనంతపురం జిల్లా…

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 4 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.