

వింజమూరు(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
ప్రశాంతతకు మారుపేరైన తెలుగు రాష్ట్రాలలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసిపి పార్టీ కంకణం కట్టుకుందని, సమాచార మరియు హౌసింగ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల కేంద్రం లోని వింజమూరు పట్టణం యాదవ్ బజార్ నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారితో కలిసి సమాచార మరియు హౌసింగ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు.
ముందుగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మంత్రి గారికి ఘన స్వాగతం పలికి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం నాయకులు గజమాలతో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారిని మంత్రి కొలుసు పార్థసారథి గారిని సత్కరించారు. అనంతం యాదవ బజార్ నందు ప్రతి గడపకు వెళ్లి వారితో సన్నిహితంగా మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ప్రయాణం, తదితర పథకాల గురించి క్లుప్తంగా వివరించారు. వారి వద్ద నుండి సమాధానాన్ని రాబట్టారు. మహిళలు వృద్ధులు పెద్దలు అందరూ ప్రభుత్వం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆనందంగా మాట్లాడారు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల పథకాలు అందని లబ్ధిదారులు, పథకాలు అందలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వాటిని సరి చేసుకుంటే సంక్షేమ పథకాలు అందుతాయని, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి, సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు.
అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ, వైసిపి నాయకులు రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని వీటిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో లక్ష కోట్లు పెట్టుబడులే లక్ష్యంగా పరిశ్రమలు స్థాపించి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఇప్పటికే పదివేలలక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. బాబు బ్రాండ్ తోనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ఆ బూసి మళ్లీ అధికారంలోకి రాదని, ముఖ్యమంత్రి చెప్తున్నారంటే, పెట్టుబడుదారులు ఎంత భయపడ్డారు అర్థం చేసుకోవాలన్నారు. బటన్ నొక్కడం తప్పితే ఏ పని చేయని వైసీపీ ప్రభుత్వం, ఏమి చేయలేక రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని తెలిపారు. గంజాయి, బంగాకు, పరామర్శించడానికి వెళ్లి, ఒకరిని పొట్టన పెట్టుకున్నారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పంచాయతీల అభివృద్ధికి కట్టుబడి నేరుగా పంచాయతీకి నిధులను అప్పగించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో, పంచాయతీ నిధులను పక్కదారి పట్టించారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు, అమరావతి నిర్మాణం, పరిశ్రమల స్థాపనకు, కృషి చేస్తుందని, ఇలాంటి ప్రభుత్వానికి అందరూ అండదండగా నిలవాలని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారని, దీనిని సహించని వైసిపి నాయకులు, రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని తెలిపారు. ప్రజలు దీనిని తిప్పి కొట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ పొన్నుబోయిన చంచల బాబు యాదవ్ ,మండల కన్వీనర్లు గూడ నరసారెడ్డి, సిహెచ్ బయన్న, బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, మధు మోహన్ రెడ్డి,పోలినేని చంద్రబాబు నాయుడు,పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య, సీనియర్ నాయకులు, చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ గణపం సుదర్శన్ రెడ్డి, మంచాల శ్రీనివాసులు నాయుడు,వనిపెంట సుబ్బారెడ్డి, జూపల్లి రాజారావు, అంకెనపల్లి ఓబుల్ రెడ్డి, కోడూరు నాగిరెడ్డి,ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య, కూనల వెంకటేశ్వర్లు, చీకుర్తి రవీంద్రబాబు,చల్ల శ్రీనివాసులు యాదవ్, పాములపాటి మాల్యాద్రి, పీవీ నాయుడు, గాలి రామ్మోహన్ నాయుడు, ఏగినేని శ్రీనివాసులు నాయుడు, కటకం ప్రసన్నకుమార్, బండారు సత్యనారాయణ, ముంతా శ్రీనివాసులు యాదవ్, నల్లి పోగు నరసింహులు, బొజ్జ నరసింహులు, మట్ల నాగయ్య, నల్లి పోగు రాజా, దాసరి అశోక్, పోలినేని రమేష్, వేలూరి వెంకటేశ్వర్లు, గోరంట్ల నరసింహ, గొడుగులూరి మాలకొండ రాయుడు, ఆండ్ర బాల గురువారెడ్డి, సంధి రెడ్డి నాగేశ్వరరావు, యారవ కిష్టయ్య, సర్పంచ్ సృజన, గువ్వల కృష్ణారెడ్డి, దాట్ల కృష్ణారెడ్డి, దాట్ల రమణారెడ్డి, బొల్లినేని వెంకట రామారావు, పూనూరు భాస్కర్ రెడ్డి, చింతా సుబ్బారెడ్డి , వర్తినేని వెంకటేశ్వర్లు,వేమూరి దొరస్వామి నాయుడు, టీవీ సుబ్బారావు,ఎం రాఘవరెడ్డి, కే కొండప నాయుడు, తాతయ్య, మాధవరావు, బి వెంకయ్య, పాముల సుబ్బరాయుడు, రావెళ్ల నాగేంద్ర, కామేపల్లి వెంకటరత్నం, వెంకటనారాయణ, డేగ మధు యాదవ్, నూతలపాటి జయలక్ష్మి, రామలక్ష్మణలు, ఆర్డీవో వంశీకృష్ణ, తహసిల్దార్ హమీద్ ఎంపీడీవో శ్రీనివాసులు రెడ్డి, హౌసింగ్ పిడి వేణుగోపాల్,ఈ ఈ నారాయణరెడ్డి, ఎస్ డి పిరాన్, కలిగిరి వెంకటనారాయణ, వింజమూరు ఎస్సై వీర ప్రతాప్, కలిగిరి ఉమాశంకర్, వర్క్ ఇన్స్పెక్టర్లు, పంచాయతీ కార్యదర్శు రామారావు, తదితరులు ఉన్నారు.