

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 19 :- జోగులాంబ గద్వాల జిల్లా, మల్దకల్ మండలం బిజ్వారం గ్రామానికి చెందిన వృద్ధ్యాప దంపతులు కర్రెన్న సవారమ్మ,వారి మనవరాలు విద్యార్థిని శృతి అనారోగ్య కారణంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సందర్భాన్ని ఆశావర్కర్ ఎస్.కాంతమ్మ,జర్నలిస్ట్ ఎస్.తిరుమలేష్ ద్వారా తెలుసుకున్న మల్దకల్ ఎస్ఐ.నంధీకర్,బిజ్వారం గ్రామంలోని కర్రెన్న,సవారమ్మ నివాసానికి చేరుకొని మానవత్వంతో స్పందించి నెల రోజులపాటు అవసరమయ్యే నిత్యవసర సరుకులను అందించి వీరి ఆస్పత్రుల ఖర్చుల నిమిత్తమై 10 వేల రూపాయలను నేరుగా అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ఐ.నంధీకర్ మాట్లాడుతూ…. కర్రెన్న,సవారమ్మ దంపతులు వారి మనవరాలు శృతి అనారోగ్యం, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకొని నా వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేశామని అన్నారు.సమాజంలో ఇలాంటి నిరుపేదరికంలో ఉన్నవారికి మన వంతుగా సహాయం అందిస్తే మనోధైర్యంతో పాటు గొప్ప భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతామని అన్నారు.ఈ సందర్భంలో కానిస్టేబుల్ తిప్పారెడ్డి,లక్ష్మన్న, హోంగార్డు మురళి, సామాజిక కార్యకర్తలు బిజ్వారం ఎస్.తిమ్మోతి,ఎస్.కర్రెన్న,ఎస్.యువరాజ్ తదితరులు ఉన్నారు.
