

PASUMARTHI JALAIAH: మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలం బింగినపల్లి పంచాయతీ పరిధిలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పేరెంట్స్ ఉపాధ్యాయులు సమన్వయ మెగా పేరెంట్స్ డే కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గారి సమక్షంలో నాలుగు పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో సమావేశం నిర్వహించి పాఠశాలల్లో ఉన్న సమస్యలపై చర్చించడం జరిగింది.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. అదేవిధంగా బింగినపల్లి ఎస్టీ కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని అధికారులు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.
[7/10, 9:14 PM] PASUMARTHI JALAIAH: పేరెంట్స్ డే సందర్భంగా బింగినపల్లిలో పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు