

ఉరవకొండ మన న్యూస్:వజ్రకరూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు బుధవారం ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష కార్యక్రమం వైద్య అధికారి డాక్టర్ సర్దార్ వలి డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా గర్భవతులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రికార్డులు వివరాలు నమోదు చేశారు. వైద్య అధికారి మాట్లాడుతూ… గర్భవతులకు పౌష్టికాహారం పై అవగాహన కల్పించామన్నారు. గర్భిణీ స్త్రీలకు ఉచితంగా పరీక్షలు భరోసా సమగ్రమైన మరియు నాణ్యమైన ప్రసవ సంరక్షణను అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ లక్ష్మీదేవి, హెల్త్ ఎడ్యుకేటర్ సత్యనారాయణ, ఎంపీహెచ్ఈఓ గురుప్రసాద్, సూపర్వైజర్ నాగ శంకర్, సుశీలమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ లలిత , ఏఎన్ఎంలు సుకన్య, ఎం.ఎల్.హెచ్.పీలు, అమృత, సుదమాధురి, అనురాధ, నిర్మల, భారతి, ఆశా కార్యకర్తలు గర్భవతులు తదితరులు పాల్గొన్నారు.