

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 10 :- జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇందిరా మహిళా శక్తి సంబరాలలో ఆట పాటలతో ప్రజలకు వివరిస్తున్న జోగులాంబ గద్వాల్ జిల్లా సాంస్కృతిక సారధి ప్రభుత్వ కళాకారులు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న మహిళా సాధికారత సంబరాల సందర్బంగా జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు డి.ఆర్.డి.ఓ సారథ్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలో భాగంగా గద్వాల మండలం పెద్దపాడు. కొత్తపల్లి గ్రామంలో వడ్డీ లేని రుణాలు మహిళా సాధికారత ఉచిత బస్సు పథకం మరియు ఆరు గ్యారెంటీ లపై అవగాహన కల్పిస్తున్న గద్వాల సారధి ప్రభుత్వ కళాకారులు అధికారులు మరియు మహిళా సంఘాల సభ్యులు హాజరయ్యారు
ప్రభుత్వ ఉద్యోగులు పాటల రూపంలో డప్పు కొడుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర సాంస్కృతిక సారధి ఛైర్పర్సన్ వెన్నెల గద్దర్, జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ ఆదేశాలతో డిపిఆర్ఓ ఆరీఫుద్దీన్ సౌజన్యంతో సాంస్కృతిక సారథి జిల్లా ప్రభుత్వ కళాకారుల అధ్యక్షులు మొహమ్మద్ రాహుల్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జోరుగా సాగింది.ఇట్టి కార్యక్రమలు ఈ నెల 9-7-2025 నుండి 11-7-2025 వరకు మహిళా సాధికారత అంశాలపై మహిళా సంక్షేమ పథకాలపై కొనసాగుతుంది.ఈ కార్యక్రమంలో గోన్ పాడు గ్రామ ప్రజలు పెద్దలు డోక్రా సంఘాల మహిళలు మరియు కళాకారులు కేశవులు. భూపతి. హజరత్. కృష్ణ పాల్గొన్నారు.
