

ఉరవకొండ, మన న్యూస్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం (నేడు) ఉదయం 10 గంటలకు ఒక మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహించబడుతుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక అతిథిగా పాల్గొంటారు.కళాశాల అధ్యాపకులు ఈ సమావేశానికి అధిక సంఖ్యలో తల్లిదండ్రులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల అభివృద్ధి, విద్యా నాణ్యత మరియు పాఠశాల కార్యక్రమాలపై చర్చించడం ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం. సమయం: గురువారం, ఉదయం 10:00 గంటలు. “స్థలం:ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల తల్లిదండ్రులందరూ తప్పకుండా హాజరయ్యేందుకు అధ్యాపకులు కోరుకుంటున్నారు.