

రైతులు ఆదుకోవడంలో ముందంజలో కూటమి ప్రభుత్వం ఉంది జిల్లా టిడిపి నాయకులు
ఎస్ఆర్ పురం, మన న్యూస్…మామిడి రైతుల గురించి మాట్లాడే అర్హత వైసిపి పార్టీకి లేదని జిల్లా టిడిపి కార్యదర్శి కృష్ణమ నాయుడు, మాజీ మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీధర్ యాదవ్ అన్నారు.గంగాధర నెల్లూరు మండలంలో మీడియాతో మాట్లాడుతూ రైతులను ఆదుకోవడానికి ప్రత్యేకంగా తన్నుకు 4000 రూపాయలను అందించిన ఘనత టిడిపి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు .వైసిపి నాయకులు మామిడి రైతులపై అనవసరమైన మాటలు చేయడం తగదని అన్నారు. గత ప్రభుత్వంలో వైసిపి ఎన్నడూ రైతులకు మేలు చేయలేదని మండిపడ్డారు నేడు మామిడి రైతులను ఆదుకోవాలని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చేన్నాయుడు ఆధ్వర్యంలో రైతులను ఆదుకునే కార్యక్రమాలు చేపట్టారని అన్నారు వైసిపి నాయకులు రైతులపై అనవసర మాటలు మానుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో నెల్లెపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.