టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులకు మజ్జిగ పంపిణీ…

మన న్యూస్,తిరుపతి: తిరుపతిలో ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు రాసేందుకు విచ్చేసిన అభ్యర్థులకు తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు కొట్టే హేమంత్ రాయల్ ఆధ్వర్యంలో శుక్రవారం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లి సమీపంలో ఉన్న టాటా అయాన్ డిజిటల్ కేంద్రంలో డీఎస్సీ అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు విచ్చేశారు. ఈ సందర్భంగా హేమంత్ రాయల్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదటి సంతకం భారీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల మీదనే పెట్టడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ రోజురోజుకు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని, మంత్రి లోకేష్ నిబద్ధతతో పనిచేస్తున్నారని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆయన సేవలను ప్రశంసిస్తున్నారు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఉపాధ్యాయ పోస్టులు కల్పించకుండా మోసం చేశారన్నారు. వైసిపి ప్రభుత్వంలో నాడు నేడు పేరుతో వైసీపీ నాయకులకి కాంట్రాక్టు కేటాయించి నాణ్యత లేన పాఠశాల భవనాలు నిర్మించి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు శ్రీ కారం చుట్టారని పేర్కొన్నారు. నిరుద్యోగత లేని రాష్ట్రంగా చేయడమే చంద్రబాబునాయుడు లక్ష్యమని హేమంత్ రాయల్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నందకిషోర్ జస్వంత్, జ్ఞానేష్, శీను, అరవింద్, విష్ణు పాల్గొన్నారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///